ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యదవ్ 19 పరుగులు చేశాడు. చివరలో రింకూ సింగ్ కేవలం 9 బంతుల్లో 31 పరుగుల చేసి స్కోరును పెంచాడు.
Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిపై మూత్ర విసర్జన చేసి, దాడి..
ఇక.. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కస్ స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ముందు టీమిండియా ఓ భారీ స్కోరును పెట్టారు. చూడాలి మరీ ఈ స్కోరును చేజ్ చేస్తారా లేదంటే.. ఈ మ్యాచ్ లో కూడా చేతులెత్తేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. విశాఖలో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
Read Also: NIA: పాక్ లింక్డ్ “గజ్వా-ఏ-హింద్” టార్గెట్‌గా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..
