NTV Telugu Site icon

T20 World Cup 2024: సూప‌ర్ 8లో టీంఇండియాతో తలపడే జట్లు అవేనా..

Team India

Team India

టీ20ప్ర‌పంచ‌క‌ప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్లు చివరి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక‌ లాంటి బలమైన జ‌ట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ ద‌శ నుంచి ఇంటి ముఖం ప‌ట్టాయి. దింతో సూప‌ర్ 8కి చేరే జ‌ట్ల‌పై కాస్త అంచ‌నా వ‌చ్చేసింది. ప్రస్తుతానికి భార‌త్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ద‌క్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్ప‌టికే సూప‌ర్ 8కి అర్హ‌త సాధించగా.. మ‌రో మూడు స్థానాల కోసం కాస్త గ‌ట్టి పోటీ ఉందనే చెప్పాలి. ఇక నేడు గ్రూప్ A నుండి ఫ్లోరిడా వేదిక‌గా అమెరికా, ఐర్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌ లో అమెరికా గెలిచినా, లేదా ఎథియాన్ సమస్య వల్ల మ్యాచ్ ర‌ద్దైనా సరే అమెరికా సూప‌ర్ 8కి చేరుతుంది. దింతో పాకిస్తాన్ జట్టు త‌న చివ‌రి మ్యాచ్‌ తో అవసరం లేకుండా టోర్నీ నుంచి వైదొలుగుతుంది.

ఇక సూప‌ర్ 8 ద‌శ‌లో టీంఇండియాతో త‌ల‌ప‌డ‌బోయే ప్ర‌త్య‌ర్థులు ఓ అంచనా వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 20న టీంఇండియా త‌న మొదటి సూప‌ర్ 8 మ్యాచ్‌లో గ్రూప్ Cలో అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టుతో ఆడుతుంది. ఇక ప్ర‌స్తుతానికి పాయింట్ల ప‌ట్టిక చూస్తే అఫ్గానిస్తాన్ ఉంది. ఒకవేళ అది కాకపోతే వెస్టిండీస్ కూడా అవ్వొచ్చు. ప్ర‌స్తుతం గ్రూప్ Cలో అఫ్గానిస్తాన్ , వెస్టిండీస్ జ‌ట్ల పాయింట్లు స‌మానంగా ఉన్న‌ప్ప‌టికీ మెరుగైన ర‌న్‌రేట్ వల్ల అఫ్గానిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. ఇకపోతే ఇరు జ‌ట్లు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆఖ‌రి మ్యాచుల్లో వారి గెలుపోట‌ముల బ‌ట్టి భార‌త ప్ర‌త్య‌ర్థి మారే అవ‌కాశం లేకపోలేదు.

జూన్ 22న టీంఇండియా త‌న రెండో మ్యాచ్‌ను ఆడుతుంది. గ్రూప్ Dలో రెండో స్థానంలో నిలిచిన జ‌ట్టుతో ఆడనుంది. గ్రూప్‌ Dలో ప్ర‌స్తుతం సౌతాఫ్రికా అగ్ర‌స్థానంలో ఉండగా.. ఈ క్ర‌మంలో టీంఇండియా ప్ర‌త్య‌ర్థి బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్ లో ఏదో ఒక జట్టు ఉండొచ్చు. ఇక ఆపై భార‌త జ‌ట్టు జూన్ 24న త‌న మూడో మ్యాచ్‌ ను ఆడ‌నుంది. ఆ మ్యాచ్ లో గ్రూప్ B అగ్ర‌స్థానంలో ఉన్న జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఇప్పటికే గ్రూప్ B లో ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో ఉండగా ఇదే స్థానంతో ఆసీస్ గ్రూపును ముగించే అవ‌కాశాలు బాగా ఉన్నాయి.

దీన్ని బట్టి చూస్తే టీంఇండియా సూప‌ర్ 8లో ఇలా ఉండొచ్చు.
జూన్ 20 – అఫ్గానిస్థాన్‌ లేదా వెస్డిండీస్
జూన్‌ 22 – బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌
జూన్ 24 – ఆస్ట్రేలియా