Site icon NTV Telugu

Prasidh Krishna: ఓ ఇంటివాడైన టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ.. చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి

Prasid

Prasid

Prasidh Krishna: భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. కొద్దిమంది టీమిండియా క్రికెటర్లు మాత్రమే ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, కృష్ణప్ప గౌతమ్, దేవదత్ పడిక్కల్ లు హాజరయ్యారు.

Read Also: Baba Vanga: భూమిపై అణు విపత్తు.. సౌర తుఫానుల తప్పవా..? భయపెడుతున్న బాబా వంగా జ్యోతిష్యం

అయితే ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్న చిన్ననాటి భాగస్వామి రచనది కూడా కర్నాటకనే. కానీ ఉద్యోగం రీత్యా రచన ప్రస్తుతం యూనైటెడ్ స్టేట్స్ లో ఉంటుంది. టెక్సాస్ లోని డెల్ కంపెనీలో ఆమె ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లో పట్టా పొందిన రచన.. ఎంట్రప్రెన్యూర్ గా కూడా ఉంది.

Read Also: Viral Video: మేకల మందపై కోతి ఫీట్లు.. బాహుబలి 2 ఫైట్ సీన్ రిపీట్..!

27 ఏండ్ల ఈ యువ బౌలర్.. 2021లో ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా భారత్ కు 14 వన్డేలు ఆడిన ప్రసిధ్.. 25 వికెట్లు పడగొట్టాడు. ఇక 2022 ఐపీఎల్ లో అతడు రాజస్తాన్ తరుపున ఆడాడు. ట్రెంట్ బౌల్ట్ తో కలిసి పేస్ బౌలింగ్ కు కీలకంగా మారాడు. రూ.10 కోట్ల భారీ ధరతో అతడిని దక్కించుకోగా.. ఆ సీజన్ లో ప్రసిధ్.. 17 మ్యాచ్ లలో 19 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ ఫైనల్ చేరడంలో ప్రసిధ్ కూడా కీలక పాత్ర పోషించాడు. కానీ ఐదు నెలల క్రితం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

Exit mobile version