Site icon NTV Telugu

Jasprit Bumrah Back: ఐర్లాండ్‌కు టీమిండియా.. కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా లుక్ వైరల్!

Jasprit Bumrah Back

Jasprit Bumrah Back

IND vs IRE, Jasprit Bumrah return to international cricket: తాజాగా విండీస్‌ పర్యటన ముగించుకున్న భారత్.. ఐర్లాండ్‌ టూర్‌కు సిద్ధమవుతోంది. ఐర్లాండ్‌ పర్యటన కోసం నేడు భారత జట్టు ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరింది. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐర్లాండ్‌ పర్యటనలో భారత్‌ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మంగళవారం డబ్లిన్‌కు బయలుదేరే ముందు భారత ప్లేయర్స్ విమానంలో ఉన్న ఫొటోస్ షేర్ చేసారు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లు కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో బీసీసీఐ పంచుకుంది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ మరియు శివమ్ దూబే కూడా ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరారు. ‘ఐర్లాండ్.. మేం వస్తున్నాం’ అని బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. బుమ్రా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

చాలా నెలల తర్వాత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వస్తున్నాడు. వెన్ను గాయం కారణంగా గత సంవత్సరం యూఏఈలో జరిగిన ఆసియా కప్ 2022 నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రపంచకప్ 2023కి ఈ పర్యటనను అతడు సన్నద్ధతగా వాడుకోనున్నాడు. ఐర్లాండ్‌ పర్యటనలో జరిగే 3 మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఆరంభం అవుతాయి. ఈ మూడు మ్యాచ్‌లు డబ్లిన్‌లోని ద విలేజ్‌ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లు జియో సినిమా యాప్‌, స్పోర్ట్స్‌ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Also Read: Match Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. దేశం దాటకుండా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్‌పై నిషేధం!

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు:
జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

Exit mobile version