NTV Telugu Site icon

Rohit Sharma: నన్ను, కోహ్లీనే అడుగుతారా?.. ఏం జడేజాను అడగరేం: రోహిత్ శర్మ

Rohit Sharma Interview Odi

Rohit Sharma Interview Odi

Still I have not decided to give up the T20 Format Said Indian SkipperRohit Sharma టీమిండియా సీనియర్ పేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మొహ్మద్ షమీ, రవీద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి వారు ప్రస్తుతం టీ20లు ఎక్కువగా ఆడడం లేదు. బుమ్రా, రాహుల్, అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. కోహ్లీ, రోహిత్, జడేజాలు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికి కోహ్లీ, రోహిత్ టీ20లు ఆడరని.. ఇక పొట్టి ఫార్మాట్‌ నుంచి ఈ ఇద్దరు రిటైర్మెంట్ తీసుకుంటారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 ఉన్న కారణంగానే టీ20లు ఆడడం లేదని స్పష్టం చేశాడు.

ముంబైలో జరిగిన ఓ ఫుట్‌బాల్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ.. పలు అంశాలపై మాట్లాడాడు. ‘టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు వన్డేలు ఎక్కువగా ఆడలేదు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ 2023 నేపథ్యంలో చాలా మంది టీ20లు ఆడడం లేదు. ప్రపంచకప్‌కు ముందు ప్రతి మ్యాచ్‌ ఆడకూడదు. 2 ఏళ్ల ముందే ఈ విషయంలో మేం ప్రణాళికలు వేసుకున్నాం. నేను, విరాట్ కోహ్లీ టీ20లు ఆడడం లేదని అందరూ అడుగుతున్నారు. రవీంద్ర జడేజా కూడా టీ20లు ఆడట్లేదు. ఏం జడ్డూను ఎందుకు అడగడం లేదు. ప్రపంచకప్‌కు ముందు ప్లేయర్స్ తాజాగా ఉండేలా చూస్తున్నాం’ అని రోహిత్ స్పష్టం చేశాడు.

‘ఇప్పటికే భారత జట్టులో చాలా మందిని గాయాలు బాధిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్‌ 2023 ముందు కూడా గాయాల భయం వెంటాడుతోంది. గాయాలను తప్పించుకోవడానికి చిన్న అవకాశం ఉన్నా.. ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తున్నాం. బీసీసీఐతో కూడా ఈ విషయంపై మాట్లాడాం. ప్రపంచకప్‌ ముఖ్యం కాబట్టి అందరూ ఓకే అన్నారు. ప్రపంచకప్‌ నాటికి ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన భాద్యత అందరిపై ఉంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

Also Read: Friday Money Tips: శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే.. కోటీశ్వరులు అవడం పక్కా!

‘నేను ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేదు. ప్రపంచకప్‌ సాదించాలనేది నా కల. దాని కోసం పోరాడటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచకప్‌ను ఎవరూ పళ్లెంలో తెచ్చి పెట్టి తీసుకో అన్నారు. మెగా టోర్నీ కోసం ఎంతో కష్టపడాలి. 2011లో ప్రపంచకప్‌ గెలిచినప్పటినుంచి భారత జట్టు మళ్లీ కప్ అందుకోలేదు. టైటిల్ కోసం భారత్ శ్రమిస్తోంది. ప్రతి ఒక్కరూ ట్రోఫీ గెలవాలనే కసితో ఉన్నారు. ప్రస్తుతం మంచి జట్టు ఉంది. కప్ సాధించగలమన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 

Show comments