NTV Telugu Site icon

Asia Cup 2023: టీమిండియాపై పసికూన ప్రతాపం.. గౌరవప్రదమైన స్కోర్ చేసిన నేపాల్

Nepal

Nepal

ఆసియా కప్ 2023 మెగా ఈవెంట్ లో నేపాల్ జట్టు మొట్ట మొదటిసారి ఆడుతుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 104 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు.. నేడు టీమిండియాతో మ్యాచ్‌లో ఏకంగా 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్నా.. పసికూన జట్టును స్వల్ప స్కోరుకి కట్టడి చేయలేకపోయింది.

Read Also: Sudigali Sudheer: రష్మీ అలాంటింది.. అందుకే నేను ఆమెను..

అయితే, టీమిండియా ఫీల్డింగ్ తప్పిదాలు, క్యాచ్ డ్రాప్‌లతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఏకంగా భారత ఫీల్డర్లు 3 గోల్డెన్ క్యాచులను డ్రాప్ చేశారు. దీంతో నేపాల్‌ 230+ మార్కు దాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, 48.2 ఓవర్లు బ్యాటింగ్ చేసి 230 పరుగులకి ఆలౌట్ అయ్యింది.. దీన్ని వాడుకున్న నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం చేశారు.

Read Also: Virat Kohli: పాక్ ఆటగాళ్లను కోహ్లి కౌగిలించుకోవడంపై వివాదం.. గంభీర్ తీవ్ర విమర్శలు

కుశాల్ బుర్టెల్ ( 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు ) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. భీం శక్తి ( 17 బంతుల్లో 7 పరుగులు )ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్‌ ( 8 బంతుల్లో 5 పరుగులు ) ను కూడా జడ్డూ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

Read Also: China: కలవరపెడుతున్న హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత

ఇక, కుశాల్ మల్ల ( 5 బంతుల్లో 2 పరుగులు )ను సైతం జడ్డూ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో నేపాల్ జట్టు వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది. 65/0 స్థితిలో ఉన్న నేపాల్ టీమ్ 101/4 స్థితికి చేరుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఓపెనర్ ఆసిఫ్ షేక్ ( 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు ) హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత సిరాజ్ బౌలింగ్‌‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఆసిఫ్ అవుట్ అయ్యాడు. గుల్షాన్ జా ( 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు ) కూడా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనే ఇషాన్ కిషన్‌ కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

Read Also: Gautam Gambhir: కోహ్లీ ఫ్యాన్స్ కు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతమ్ గంభీర్

37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసిన టైంలో వర్షం కారణంగా కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత దీపేంద్ర సింగ్‌ని హార్ధిక్ పాండ్యా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. దీపేంద్ర సింగ్ ( 25 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు ), డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఇక, సోమ్‌పాల్ కమి ( 56 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 48 పరుగులు ), మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అదే ఓవర్‌లో 17 బంతుల్లో 9 పరుగులు చేసిన సందీప్ లామిచానే రనౌట్ అయ్యాడు. రాజ్‌భన్సీని సిరాజ్ బౌల్డ్ చేయడంతో నేపాల్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. ఇక టీమిండియా టార్గెట్ 231 పరుగులు చేయాలి.