NTV Telugu Site icon

Teachers Unions: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీలు వద్దు

Teachers 1

Teachers 1

సర్వశిక్షా అభియాన్ కార్యాలయం వద్ద ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్, యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. పిల్లకు ఇచ్చే కిట్ లు ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ నెలాఖరు‌ వరకు మాత్రమే యాప్ లో హాజరు నమోదు చేస్తారు. బదిలీల కు సంబంధించి పాత సర్వీస్ లు పరిగణలోకి తీసుకుంటారు. అవసరమైతే బదిలీ కోడ్ కూడా తెస్తామన్నారు. పాత జిఒ లను యధాతధంగా అమలు చేస్తాం అన్నారు. 1752 ప్లస్ టూ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లు భర్తీ చేస్తాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్నీ చేస్తామని హామీ ఇవ్వడం హర్షణీయం అన్నారు ఎస్.టి.యు. అధ్యక్షుడు నివాస్.

Read Also: AP Highcourt: R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. హైకోర్ట్ కీలక ఉత్తర్వులు

యూ.టి.ఏఫ్ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 292 ప్లస్ టూ పాఠశాలల్లో ప్రమోషన్ లను స్వాగతిస్తున్నాం. జీవీకే కిట్ ల కోసం ఉపాధ్యాయులు అనేకసార్లు తిరగాల్సి వచ్చింది. స్కూళ్ళకే కిట్ లు పంపాలని అడిగాం. కన్వర్షన్ కు సంబంధించి మరో అవకాశం ఇవ్వాలని కోరాం, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కామన్ బదిలీ వద్దని చెప్పాం. మంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తాం. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని చెప్పాం అన్నారు యూటీఎఫ్ నేత వెంకటేశ్వర్లు. గురుకుల పాఠశాలల్లో పోస్ట్ లు భర్తీ చేయలేదు. 117 జీఓ వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. జీఓ 117 రద్దు చేయాలని,‌16 రకాల యాప్ ల స్థానంలో నాలుగు యాప్ లు అమలు చేస్తాం అన్నారు. వేసవి సెలవులు ముగిసే లోపు అన్నీ సరిచేయాలన్నారు.

Read Also: Tenth Class Results: ఏపీలో టెన్త్ క్లాస్ ఫలితాలు.. ఎప్పుడో తెలుసా?

Show comments