Teacher Student Love Story : ప్రేమకు వయసుతో సంబంధంలేదు. ఏ వయసులోని వారైనా ప్రేమలో పడవచ్చు. ప్రేమకు కులం, మతం, ధనిక పేద తేడాలేదు. ఈ మధ్య లింగ బేధం కూడా లేదనుకోండి. అంటే సేమ్ జండర్ వాళ్లు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నారు.. అది వేరే విషయం.. తాజాగా అలాంటి మరో వెరైటీ ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. బిహార్‌లోని సమస్తిపూర్‌లో నివాసముండే ఓ 42 ఏళ్ల టీచర్ స్టూడెంట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి వయసు తేడా దాదాపు 20ఏళ్లు. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. అయినా వారికి ఇది కనిపించలేదు.
Read Also: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు
ఈ ప్రేమకథకు కోచింగ్ సెంటర్ వేదికైంది. కోచింగ్ సెంటర్‌లో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి వచ్చి ఆ టీచర్‌ను ప్రేమలో పడేసింది యువతి. టీచర్ విద్యార్థిని ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తమ ప్రేమబంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలనుకున్న వీరిద్దరు తాజాగా గుడిలో వివాహం చేసుకున్నారు. చుట్టుపక్కల వారు, కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటోన్న విద్యార్థులు కూడా వీరి వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గురువుగారి మొదటి భార్య చాలా ఏళ్ల క్రితమే మరణించింది. అయితే అతను మాత్రం రెండవ పెళ్లి చేసుకోవడంపై ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే ఈ విద్యార్థిని కోచింగ్ సెంటర్‌లోకి అడుగుపెట్టిందో ఆమెపై ప్రేమ మొదలైంది. ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. ఇందుకు విద్యార్థిని కూడా అంగీకరించడంతో ఎంచెక్కా పెళ్లితో మరోమారు ఏడడుగులేశారు మాస్టారు.
