Site icon NTV Telugu

Minor Rape : కీచక లెక్చరర్‌.. మైనర్‌ అమ్మాయిపై అత్యాచారం

Minor Girl Rape

Minor Girl Rape

రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా . అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. ఈ రోజు హైదరాబాద్ పాతబస్తీ లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ నాన్న తరువాత గురువు దైవంతో సమానం అని చెప్పే మన సమాజంలో.. అదే గురువు కాల సర్పం అయితే.. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మైనర్‌పై అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. షేక్‌ ఇక్బాల్ అనే వ్యక్తి శ్రీ గీతాంజలి కాలేజీ లో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. షేక్‌ ఇక్బాల్‌ ఇంటి ఎదురుగా మైనర్ అమ్మాయి నివాసం.

అయితే.. సదరు అమ్మాయి తల్లి తండ్రులు అమ్మాయికి ట్యూషన్ కొరకు అతని వద్దకు పంపటం జరిగింది. అయితే.. ఈ నేపథ్యం (మైనర్ లకు అంత లోక జ్ఞానం ఉండదు కాబట్టి వారు చూసిందే కావాలి అనుకొంటారు అంటే ఆ వయస్సు లో ఆకర్షణ ఎక్కువ అన్న మాట) లో లెక్చరర్ అమ్మాయి నీ మభ్య పెట్టీ. అమ్మాయిన్నీ పలు మర్లు హత్యచారానికి ఒడిగాటాడు. ఈ విషయం తెలుసుకొన్న తల్లితండ్రులు బండ్లగుడా పోలీస్ స్టేషన్ చేరుకొని అతని పై ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version