Site icon NTV Telugu

Violence : బాలుడిపై ఉపాధ్యాయుడి దౌర్జన్యం.. 1వ తరగతి విద్యార్థిని తీవ్రంగా కొట్టిన టీచర్‌

Teacher

Teacher

Violence : గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీటుపీజీ క్యాంపస్‌లో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు దేవరాజు ఒకటో తరగతి చదువుతోన్న బాలుడు లవన్ సాయి కుమార్‌పై శారీరక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థి తరగతిలో అల్లరి చేశాడనే కారణంతో ఉపాధ్యాయుడు అతని వీపుపై బలంగా కొట్టినట్టు సమాచారం. ఇంటికి చేరిన బాలుడి పైన గాయాలను గమనించిన తల్లి, వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే పాఠశాల సమయం ముగియడంతో ఉపాధ్యాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు రామచంద్రం మాట్లాడుతూ, దేవరాజు మానసిక స్థితి పూర్తిగా స్థిరంగా లేదని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలనే డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్‌ పాత్ర ..

Exit mobile version