Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విద్యార్థినులతో తలకు కొబ్బరి నూనె రాయించుకుని మసాజ్ చేయించుకోవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.
కస్తూరీబా గాంధీ పాఠశాలలో టీచర్ రూపా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇద్దరు విద్యార్థినులతో తన తలకు కొబ్బరి నూనె రాయించి మసాజ్ చేయించుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తులు రహస్యంగా ఫోటోలు తీశారు. అనంతరం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఇలాంటి వ్యక్తిగత పనులు చేయించుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, పాఠశాలల్లో పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని మండిపడ్డారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక సమాచారం సేకరించి విచారణకు ఆదేశించారు. వైరల్ అవుతున్న ఫోటోలతో పాటు ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి.. నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. విచారణ ఆధారంగా టీచర్ రూపాపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!