NTV Telugu Site icon

TDP vs YSRCP: గుడివాడలో టెన్షన్ టెన్షన్.. పోటాపోటీగా ఎన్టీఆర్‌ వర్ధంతి

Gudivada

Gudivada

TDP vs YSRCP: కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. రేపు గుడివాడలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటాపోటీగాఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. గురువారం రోజు గుడివాడకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అక్కడ నిర్వహించనున్న రా.. కదలిరా సభలో ఆయన పాల్గొనబోతున్నారు. మరోవైపు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.. ఒకే రోజు ఇటు టీడీపీ సభ, అటు కొడాలి నాని కార్యక్రమం ఉండడంతో.. గుడివాడలో ఏం జరుగుతుందో? అనే టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అలెర్ట్‌ అయిన పోలసులు.. భారీ బందోస్తు ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు..

Read Also: Captain Miller Trailer: టాలీవుడ్ అగ్ర హీరోల చేతుల మీదుగా కెప్టెన్‌ మిల్లర్‌ ట్రైలర్!

రేపు ఉదయం ఎన్టీఆర్‌ స్వస్థలం నిమ్మకూరు వెళ్లనున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.. అక్కడ, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత గుడివాడ-ముదినేపల్లి రోడ్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు సమీపంలోనే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొడాలి నాని అన్నదాన కార్యక్రమానికి సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. దీంతో.. గుడివాడలో ఏం జరుగుతుందనే టెన్షన్‌ నెలకొంది.. ఇప్పటికే కొడాలి నాని, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమానికి పోటాపోటీగా నిర్వహించేందుకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా బందోస్తు నిర్వహించే పనిలో మునిగిపోయారు పోలీసులు.