NTV Telugu Site icon

Avanigadda: పీక్స్‌కు చేరిన టీడీపీ-జనసేన పొత్తు పంచాయితీ.. అవనిగడ్డలో అల్టిమేటం..!

Avanigadda

Avanigadda

Avanigadda: ఆంధ్రప్రదేశ్‌లో విజయమే లక్ష్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ముందుకు నడుస్తుంటే.. ఈ పొత్తుల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతుంది.. ఆ మూడు పార్టీల మధ్య పొసగని పరిస్థితి తీసుకొస్తుంది.. తాజాగా ఒకేసారి 18 మంది.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జనసేన పార్టీ.. కాగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని కూడా వెల్లడించింది.. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఇది కొత్త పంచాయితీకి దారితీసినట్టు అయ్యింది.. పొత్తు ధర్మం పాటించకుండా ఆందోళనకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్ కు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.. బుద్ధ ప్రసాద్ కు టికెట్ కేటాయించకపోతే ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వార్నింగ్‌ ఇస్తున్నారు..

Read Also: Goa: గోవాలో తొలిసారి ఎంపీ అభ్యర్థిగా మహిళను రంగంలోకి దించిన బీజేపీ

ఇక, టికెట్ మాకే ప్రకటించాలంటూ మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమయ్యారు తెలుగు తమ్ముళ్లు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను లెక్కచేయకుండా అవనిగడ్డ టికెట్ తెలుగుదేశం పార్టీకి ప్రకటించకపోతే రాజీనామా చేస్తామంటూ బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వార్నింగ్‌ ఇవ్వడం చర్చగా మారింది. అయితే, టీడీపీ నాయకుల తీరుపై నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు..