పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో పాటు సుమారు 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుట్లగూడెంలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి నచ్చి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. అది చూసి చాలా మంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరు కృషి చేయాలని సూచించారు.
Read Also: Dharmapuri Arvind: చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమే జీవన్ రెడ్డి.. అరవింత్ సంచలన వ్యాఖ్యలు
కాగా, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు 600 పేజీల మేనిఫెస్టోను రిలీజ్ చేసి.. ఫెయిలయ్యారన్నారు. కానీ సీఎం జగన్ మాత్రం 2019లో మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చారని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ సూపర్ సిక్స్ అంటూ మోసం చేయడానికి మళ్లీ వస్తున్నారన్నారు. ఇప్పడు ప్రతి అంశాన్ని అమలు చేస్తామంటున్న చంద్రబాబు.. 2014లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని నంబూరు శంకరరావు ప్రశ్నించారు. కానీ, సీఎం జగన్ మాత్రం కరోనా కష్టం వచ్చినా.. సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఇప్పుడు కూడా తాను చేయగలిగినవే నిజాయితీగా మేనిఫెస్టోలో చేర్చారన్నారు. ప్రజాక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటేనే ఇన్ని మంచి పనులు సాధ్యమన్నారు. అందుకే ప్రజలు జగనన్నపై నమ్మకం ఉంచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కోరారు.
Read Also: Tamannaah Bhatia : సారీ రాలేను.. నాకు టైం కావాలి.. సైబర్ సెల్ ను కోరిన తమన్నా
ఇక, ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం అవినీతి లేని పాలన అందిస్తున్న వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. గత ఐదేళ్ల పాలనలో మంచి చేశానని భావిస్తేనే.. తన వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని సీం జగన్ చెప్పారన్నారు. అంత ధైర్యంగా ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందాని ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడవడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందన్నారు. పేదలకు మంచి చేసిన వాలంటీర్లను సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. గతంలో వాలంటీర్లను దోపిడీదారులు, దొంగలు అన్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటూ మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటు వస్తే.. మళ్లీ అక్రమాలు, అన్యాయాలు ఖాయమని తెలిపారు. అలాగే, పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు కోరారు.