TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులు, పోటీలపై చర్చ సాగుతోంది.. అయితే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని దసరాకు ప్రకటించాలని, పొత్తులపై నిర్ణయం కూడా ఎన్నికల ముందే తీసుకోవాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నరాయుడు అధ్యక్షతన రాజమండ్రిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాజమండ్రి వేదికగా ఈ రోజు ప్రారంభం కానున్న మహానాడులో ప్రవేశపెట్టనున్న 15 తీర్మానాలపై చర్చించారు.
Read Also: FD Interest Rates: ఆ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై పెరిగిన వడ్డీ రేటు
మొత్తంగా మహానాడులో పొత్తులపై ప్రకటన ఉండదని తేల్చారు టీడీపీ నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుపై నిర్ణయం ఎన్నికల సమయంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. ఇక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానించనున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం సీనియర్ నేతలు కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వస్తే
ప్రజా సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామనేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మరోవైపు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాత్రదారులతోపాటు, సూత్రధారులను బయటపెట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనివ్వకుండా డ్రామా నడుస్తుంది విమర్శలు గుప్పించారు..
