Kesineni Nani: విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి షాక్ ఇస్తూ.. రాజకీయాలపై క్లారిటీ వచ్చింది టీడీపీ.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరేవారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని.. తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేంది టీడీపీ అధిష్టానం. అయితే, ఇక, ఈ పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎంపీ కేశినేని నాని.. ఇకపై ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని నేను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు.. తినబోతూ రుచులెందుకు? మీరే చూస్తారు భవిష్యత్తులో ఏం జరుగుతోందో అంటూ మీడియా చిట్‌చాట్‌లో పేర్కొనడంతో.. బెజవాడ రాజకీయాలు కొత్త మలుతు తీసుకుంటాయా? అనే చర్చకు దారి తీసింది.
Read Also: Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్‌కు సైతం సాధ్యం కాలే!
ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న ఎంపీ కేశినేనా నాని.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టా.. కానీ, మీడియాకు కావాల్సింది మసాలెనేగా.. తినబోతూ రుచులెందుకు..? అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కరెక్ట్ కాకపోవచ్చు?.. అది ఎవరికి ఎలా అర్ధమైతే అలా ఇచ్చుకోండి, మీడియాను పట్టించుకోవటం ఎప్పుడో మానేశాను అని పేర్కొన్నాడు. రేవంత్ రెడ్డి దొంగా, అంటూ ఓ వర్గం మీడియా తెలంగాణ ఎన్నికల్లో ఏదేదో ప్రచారం చేసింది.. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయి కూర్చున్నాడు అని గుర్తుచేశారు. ఇక, 2024 మే వరకూ నేనే విజయవాడ ఎంపీని.. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.
Read Also: Sam Altman: మాట్లాడితే ప్రతీకారం ఉంటుందని “ముస్లింలు” భయపడుతున్నారు..
ఇక, ఈ నెల 7వ తేదీన నేను తిరువూరు వెళ్లడంలేదని స్పష్టం చేశారు కేశినేని నాని.. నేను వెళ్తే నా వాళ్లు ఆగరు.. నేను వెళ్తే గొడవలు అవుతాయి.. నా నసీబ్ ఎలా ఉందో.. ఎవరి నసీబ్ ఎలా ఉందో అప్పుడే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. నేను ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒక ఫ్లైట్ పోతే.. ఇంకో ఫ్లైట్ ఢిల్లీకి ఉంటుంది.. ఫిబ్రవరి మొదటి వారంలో నా నిర్ణయం చెపుతా అన్నారు. గొడవలు పడటం నా తత్త్వం కాదు.. అలా అయితే యువగళంలోనే గొడవలు జరిగేవి అన్నారు. నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు.. అలా పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండే వాడిని కదా? అని ప్రశ్నించారు. నన్ను చంద్రబాబు వద్దనుకున్నారు.. కానీ, నేను అనుకోలేదన్నారు. పార్టీ చరిత్రలో అత్యంత త్వరగా టికెట్ లేదని చెప్పాడు.. నామినేషన్ చివరి రోజు వరకూ నాన్చలేదన్నారు. మరోవైపు.. నేను రోజూ చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు ఎంపీ కేశినేని నాని.