MLC Ashok Babu: రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. హెల్త్ రిపోర్టు ఇవ్వాల్సిన బాధ్యత విస్మరించారని.. జైళ్ల శాఖ డీజీఐ ఒక డాక్టర్‌లా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. పాత మెడికల్ హిస్టరీ తెలుసుకోకుండా జైళ్ల శాఖ డీజీఐ మాట్లాడారన్నారు. 2,039 మంది ఖైదీల్లో చంద్రబాబు ఒక్కరినే ప్రత్యేకంగా చూడలేమంటూ జైలు అధికారి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.
Also Read: Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికలు అంత ఈజీగా ఉండవు..
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ..”140 కోట్ల మంది భారతీయుల్లో జగన్ ఒక్కడే. అలాంటి వ్యక్తికి హెలీక్యాప్టర్, బల్లెట్ ప్రూఫ్ వెహికల్, సెక్యూరిటీ అన్ని ఎందుకు..?. చంద్రబాబు హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా చూడాలి.జగన్ చంచల్‌గూడ జైల్లో ఎంజాయ్ చేసినట్లు చంద్రబాబు ఎంజాయ్ చేయటం లేదు. 74 ఏళ్ల చంద్రబాబు డీహైడ్రేషన్, ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం డెర్మటాలజీ చెకప్ చేయిస్తే చాలదు, బాడీ చెకప్ చేయాలి. డాక్టర్లు చెప్పింది యధాతథంగా చెప్పటం లేదు. హెల్త్ బులిటెన్ విడుదల చేయటంలేదు. చంద్రబాబు వెయిట్ నెల క్రితం ఎంత ఉన్నింది, ఇప్పుడెంత ఉంది డాక్టర్లు చెప్పాలి. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.” అని ఆయన పేర్కొన్నారు.