Yarlagadda Venkat Rao: ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వై నాట్ 175 అన్న వైసీపీ పార్టీ రెండు నెలలు తిరగకుండానే సిద్ధం అనే స్థాయికి పడిపోయిందని యార్లగడ్డ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే గాని ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదాయాన్ని పెంచి ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేటర్‌గా చంద్రబాబు కాదు అని.. ఒక్క ఓటర్ గానీ, ఏ ఒక్క నాయకుడు గానీ, ఏ ఒక్క పార్టీ గానీ చెప్పే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ 2019లో తప్ప ఏ ఎన్నికల్లోనూ సింగిల్‌గా పోటీ చేయలేదని.. డైనమిక్ లీడర్ లాంటి ఎన్టీ రామారావు కూడా పొత్తుతోనే ముందుకెళ్లాడన్నారు. ఈ కౌరవ సభలో చంద్రబాబు ముఖ్యమంత్రిగానే అమరావతిలో కాలుపెడతాడన్నారు.
Read Also: Pemmasani Chandrashekar: బీజేపీతో పొత్తు పవన్ చొరవే.. ప్రచారంలో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు
రంజాన్ వేడుకల్లో యార్లగడ్డ..
రంజాన్ పర్వదినం సందర్భంగా గన్నవరంలోని జామా మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో బచ్చుల బోసు, తులసీ మోహన్, జాస్తి శ్రీధర్, షేక్ రఫీ, షేక్ జాకీర్ హుస్సేన్, షేక్ బాబులాల్, సుకుమార్, ఫరూక్, ఆరిఫ్, అంజుమన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.