NTV Telugu Site icon

Yarlagadda Venkat Rao: చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు

Yarlagadda

Yarlagadda

గన్నవరం నియోజకవర్గంలోని పలు మండలంలో యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం మండలంలోని రామచంద్రపురం H/O సూరంపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని యార్లగడ్డకు మద్దతు పలికారు. ఇక, యార్లగడ్డ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. చంద్రబాబు సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.

Read Also: Big Saving Days Sale 2024: బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. మోటో ఎడ్జ్‌ 40 నియోపై భారీ తగ్గింపు!

ఇక, రాష్ట్ర భవిష్యత్త్ కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాలని గవన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, అదే విధంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి వల్లభనేని బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన యార్లగడ్డకి, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

Show comments