Site icon NTV Telugu

TDP: రంగంలోకి టీడీపీ అధిష్టానం.. అసంతృప్త నేతలకు బుజ్జగింపులు..!

Tdp

Tdp

TDP: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఓవైపు ఎన్నికల ప్రచారంపై ఫోకస్‌ పెడుతూనే.. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడిపోయింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. కర్నూలు జిల్లాలో సీటు దక్కని అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో టీడీపీ హైకమాండ్‌ పడిపోయింది.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ రెబెల్స్ గా పోటీకి సిద్ధమవుతోన్న పలువురు నేతలను సంప్రదింపులు జరుపుతున్నారు.. ముఖ్యంగా కోడుమూరు, ఆదోని, మంత్రాలయం టీడీపీలో తీవ్రమైన సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తోంది అధిష్టానం.. కోడుమూరులో ఆకెపోగు ప్రభాకర్, ఆదోనికి చెందిన మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన తిక్కారెడ్డితో చర్చలు జరుపతున్నారు పార్టీ జోనల్‌ ఇంఛార్జ్‌ బీద రవిచంద్ర నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం.

Read Also: Billionaire Barber: సింగల్ పేమెంట్.. ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బిలియనీర్ బార్బర్..!

ఇప్పటికే కోడుమూరులో ప్రభాకర్, మంత్రాలయంలో తిక్కారెడ్డితో చర్చలు జరిపారు టీడీపీ నేతలు.. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ తిక్కారెడ్డి, ప్రభాకర్ మండిపడినట్టుగా తెలుస్తోంది.. మళ్లీ ఇవాళ కూడా కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్ ను బుజ్జగించేందుకు బీద రవిచంద్ర యాదవ్ టీమ్‌ వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరాగాల్సి వచ్చింది.. అయితే, కోడుమూరు టికెట్‌ను అమ్ముకున్నారని బీదరవిచంద్రపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారట.. మరోవైపు.. ఆలూరు టికెట్ తనకివ్వలేదని, తనను కలసే ప్రయత్నం చేయొద్దన్ని బీద రవిచంద్ర యాదవ్‌కు కోట్ల సుజాతమ్మ స్పష్టం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. మరి, ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయా? నేతలు రెబల్స్‌గానే బరిలోకి దిగుతారా? అనేది ఉత్కంఠగా మారిపోయింది.

Exit mobile version