Site icon NTV Telugu

TDP: గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్

Tdp

Tdp

TDP: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీ ఛార్జ్ చేస్తారా..? అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం తెలిపారు.

Read Also: Tirumala: ముగిసిన శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు.. తిరుపతిని కూడా తిరుమల తరహాలో..!

సభలో నినాదాలు టీడీపీ సభ్యులు చేశారు. నాడు, నేడు పథకం బూటకమని, విద్యాదీవెన కింద పూర్తి రీయింబర్స్‌మెంట్ ఇచ్చామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీస్సీపై కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఏసీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఏసీని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version