Site icon NTV Telugu

TDP: ఓటర్ల జాబితాలో అక్రమాలు..! మరోసారి సీఈసీ వద్దకు టీడీపీ..

Telangana Tdp

Telangana Tdp

TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రతిపక్ష నేతలు.. విపక్ష టీడీపీపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు కూడా చేసుకున్నారు.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి కూడా సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.. కొందరు అధికారులపై వేటు కూడా పడింది.. అయితే, మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధం అయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలవబోతోంది టీడీపీ బృందం.. అధికార పార్టీ ఒత్తిడితో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు.

Read Also: Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే

కాగా, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఇటీవల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు.. గతంలో చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ఢిల్లీ వెళ్లిన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.. మరోసారి ఢిల్లీ బాట పట్టారు.. వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని.. ఇదే సమయంలో విపక్షాల మద్దతుదారుల ఓట్లు పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు టీడీపీ నేతలు..

Exit mobile version