NTV Telugu Site icon

Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన

Tdp Venkayamma

Tdp Venkayamma

ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ.

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన వెంకాయమ్మ వీడియో నిన్న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత రాత్రి వెంకాయమ్మ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకాయమ్మను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ తదితరులు.

బాధిత మహిళ వెంకాయమ్మ మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో మీడియా అడిగిన వాటికి వాస్తవాలే మాట్లాడానన్నారు. ఇందుకు వైసీపీ నేతలు నా ఇంటికి వచ్చి నా గొంతు నొక్కి, జాకెట్ చించి దాడికి పాల్పడ్డారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న నాపై కనీస కనికరం చూపలేదు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులు వెంకాయమ్మ చెప్తే.. జీర్ణించుకోలేకే వెంకాయమ్మపై పథకం ప్రకారం దాడి చేశారు. గొంతెత్తి మాట్లాడితే బతికే స్వేచ్ఛ రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు నక్కా ఆనందబాబు.

పథకం ప్రకారమే రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు చేయిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈ ఘటనపై మండిపడ్డారు. వెంకాయమ్మ పేదరికంలో ఉన్నా నీతిగా నిర్భయంగా మాట్లాడింది.బడుగులను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తే వదిలిపెట్టం అన్నారు. వెంకాయమ్మ విషయంలో ఏం చేస్తారో మహిళా కమిషన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు.

Chennur Incident: మామ వేధింపులు.. చితకబాదిన కోడలు