Yarapathineni Srinivasa Rao: మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలన ముగుస్తుందని జోస్యం చెప్పారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను పార్టీ మారతాను అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. తాను పార్టీ మారతానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ ప్రజాస్వామ్యం లేని పార్టీ.. అలాంటి పార్టీలోకి వెళ్లినవాళ్లే పారిపోతున్నారు.. నాపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. తల్లినీ, చెల్లిని కాపాడలేని జగన్ ఈ రాష్ట్రంలో మహిళలను కాపాడతాడా? అని ప్రశ్నించారు.
Read Also: Kishan Reddy: బషీర్ బాగ్ ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమం.. పాల్గొన్న కిషన్ రెడ్డి
ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని కామెంట్ చేశారు యరపతినేని.. విశాఖ ఋషి కొండను బోడిగుండు చేశారు.. రూ.500 కోట్ల ప్రజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అయ్యింది.. జగన్ అంతులేని అహంకారంతో చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టారు.. సాక్ష్యాలు లేని కేసుల్లో చంద్రబాబు ను ఇరికించారు… నకిలీ లిక్కర్ తో లక్షలాది మంది అవయవాలు పనిచేయకుండా చేశారు. నీ ధన దాహానికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. ప్రకృతి జగన్ మీద పగ పడుతుంది.. ఆ కోపం ముందు జగన్ నిలవలేడు అని వ్యాఖ్యానించారు.
Read Also: Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు
సీఎం జగన్.. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు యరపతినేని.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కార్పెట్ వేసుకుని పర్యటనలు చేసిన సైకో సీఎం జగన్ మోహన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఏపీలో రాజధాని ఏంటో చెప్పలేని పరిస్థితి.. పక్క రాష్ట్రాల వాళ్లు మీ రాజధాని ఏది అని అడుగుతుంటే ఏపీ ప్రజల పరువు పోతుంది.. మాపై అడ్డగోలుగా కేసులు పెట్టినవారు, బూతులు తిట్టినవారు అధికారం కోల్పోయినవారు ఎక్కడికి పారిపోతారు ? పార్టీ పుట్టినప్పటి నుండి టీడీపీని అభిమానించే కుటుంబం మాది.. నీతి, నిజాయితీతో పుట్టిన టీడీపీకి నేనొక పిల్లర్ లాంటి వాడిని.. అలాంటి నేను.. పార్టీ మారతాను అని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇక, పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాల ను కోరుకుంటున్నారు.. టీడీపీ ప్రభుత్వం రాగానే, కొత్త జిల్లాల్లో మార్పులు చేస్తాం అన్నారు టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు.