AP Elections 2024: ఎన్నికల కమిషన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు.. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోంది.. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను అస్త్రంగా చేసుకునేలా వైసీపీ అభ్యర్ధులు వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్ధితో కుమ్మక్కై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమాను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ కుట్ర పన్నారని లేఖలో పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల వద్ద నుంచి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేసి బోండా ఉమాను అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడలో వెల్లంపల్లి ఓడిపోతున్నాడని అతని విజయావకాశాలు పెంచడం కోసమే పోలీసులు ఈ పథకం పన్నారు.. అందుకే ఈ కేసులో బెయిల్ కూడా రాకుండా ఉండడానికి సెక్షన్ 307 IPC పెట్టారని లేఖలో ఈసీ దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: China: కుంగిపోతున్న చైనా.. ప్రమాదంలో 3వ వంతు ప్రజలు..
టీడీపీ నేత దుర్గారావుతో పాటు మరో 20 మంది మహిళలను అదుపులోకి తీసుకొని ఇప్పటివరకు వారిని ప్రజల ముందు ప్రవేశపెట్టలేదని లేఖలో పేర్కొన్నారు వర్ల .. నామినేషన్ వేసిన అభ్యర్ధులను అక్రమంగా అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురి చేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. రాష్ట్రంలోకి ప్రత్యేక ఈసీ బృందాలు వచ్చి పోలీసుల పని తీరును పరిశీలించాలి, అప్పుడే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయి. దురుద్దేశంతో కూడిన ప్రాసిక్యూషన్ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు స్వేచ్ఛ కల్పించకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన ఎన్నికల సంఘం దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.
