China: చైనా కుంగిపోతోంది. ఆ దేశంలోని పలు ప్రాంతాలు కొన్నేళ్లుగా కుంగిపోతున్నట్లు తేలింది. చైనాలోని పట్టణ జనాభాలో దాదాపుగా మూడింట ఒక వంతు మంది ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2120 నాటికి చైనాలోని పట్టణ జనాభా మూడు రెట్లు పెరిగి, 55 నుంచి 128 మిలియన్ల ప్రజలు ప్రభావితం అవుతారని కనుగొన్నారు. శాటిలైట్ డేటాను పరిశీలించిన పరిశోధన బృందం దాదాపు 700 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై, బీజింగ్ నగరాలతో పాటు 82 నగరాలపై అధ్యయనం చేసింది.
Read Also: Love Jihad: కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురి హత్య.. లవ్ జిహాద్ అంటూ బీజేపీ ఆరోపణలు.. తండ్రి కూడా..
UKలోని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులతో సహా బృందం విశ్లేషణల ప్రకారం.. పట్టణ భూభాగంలో 45 శాతం కుంగిపోతుందని, 16 శాతం సంవత్సరానికి 10 మిల్లిమీటర్ల చొప్పున దిగువకు వెళ్తున్నట్లు కనుగొన్నారు. ఎక్కువ ప్రభావిత ప్రాంతాల్లో బీజింగ్, తీరప్రాంత నగరం టియాంజిన్ ఉన్నాయి. దాదాపుగా 70 మిలియన్ల జనాభా ఏడాదికి 10 మి.మీ లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా క్షీణతను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
ప్రధానంగా నగరాల్లో మానవ కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోవడం, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం కూడా వేగవంతం అవువతోందని, దీంతో టియాంజిన్‌తో సహా తీర ప్రాంత నగరాలను ఎక్కువ ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. భవనాల బరువుతో పాటు భూగర్భ జలాల ఉపసంహరణ ద్వారా సబ్‌సిడెన్స్ వంటి దృగ్విషయానికి దారి తీస్తోంది. సబ్‌సిడెన్స్, సుముద్రమట్టాల పెరుగుదల రెండూ కలిసి 2120 నాటకి 55 నుంచి 128 మిలియన్ల నివాసితులపై ప్రభావం పడుతుందని పరిశోధన తేల్చింది. చైనాలో అతిపెద్ద నగరం షాంఘై గత శతాబ్ధకాలంలో 3 మీటర్ల వరకు కుంగినట్లు కనుగొన్నారు.