ఏపీలో దళిత సంక్షేమంపై విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఏపీలో దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ విసిరారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీలోని దళిత మంత్రులపై సీరియస్ కామెంట్లు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. వైసీపీ దళిత మంత్రులు జగన్ మోచేతి నీరు తాగుతున్నారు. వైసీపీ దళిత మంత్రులు బిస్కెట్ బ్యాచ్. కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వైసీపీలో దళితులకు బిస్కెట్లు వేస్తారు.
వైసీపీలోని దళిత మంత్రులంతా చీరలు కట్టుకోవాలి.విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టినప్పుడే వైసీపీలో దళితులు ఫినిష్ అయింది.మంత్రిగా ఉండి చొక్కా విప్పి గంజాయి తాగిన వాడిలా సురేష్ వ్యవహరించారు.మంత్రి సురేష్ ఓ యూజ్ లెస్ ఫేలో. ఐఆర్ఎస్ చేసిన సురేష్ బఫూన్ మాదిరి వ్యవహరించారు.సజ్జల చెబితే చొక్కా విప్పడానికి సురేషుకైనా సిగ్గుండాలిగా..?డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి మతి స్థిమితం లేదు.నారాయణ స్వామికి సిగ్గు ఎగ్గు లేదని మండిపడ్డారు వర్ల రామయ్య.
Read Also: GT vs LSG : 10 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోర్ ఇలా..
రెడ్లందరూ కూర్చొంటే దూరంగా చేతులు కట్టుకుని నిల్చొంటారా..?జగన్ ఎంత మంది దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చారో మంత్రి మేరుగ సమాధానం చెప్పగలరా..?అంబేద్కర్ పేరు విదేశీ విద్యకు తొలగిస్తే దళిత మంత్రులు కనీసం నోరెత్తలేదేందుకు..?దళిత యువకుడు.. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ చంపేస్తే దళిత మంత్రులు ఎందుకు ప్రశ్నించలేదు..?యూటూ బ్రూటస్ జూపూడి.ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మనుగా జూపూడి చేసిన వ్యవహారాలన్నీ మా దగ్గర ఉన్నాయి.జూపూడి.. ఆ రోజు కార్పోరేషనులో ఉన్న అధికారి సంగతి తేలుస్తాం.
బెస్ట్ అవలైబుల్ స్కూళ్లు తొలగిస్తే సిగ్గు లేని దళిత మంత్రులు ఎందుకు స్పందించ లేదు..?వైసీపీలో ఉన్న దళిత నేతలు చచ్చు పుచ్చు నేతలు.మీ బాంచన్ అనడమేనా వైసీపీ మంత్రుల బతుకు.దళితులకు ప్రమోషన్లల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి ఘనత చంద్రబాబుదే.నందిగం సురేష్.. మేరుగ.. నారాయణ స్వామి వంటి వారు ఒక్క రోజైనా సీఎం జగన్ పక్కన కూర్చొగలరా..?రేపు మంత్రులు.. అధికార పార్టీ తీరు మీద గవర్నరుకు ఫిర్యాదు చేస్తాం.ఇప్పుడు గతంలో ఉన్న గవర్నర్ కాదు.. గుర్తుంచుకోండి.ప్రస్తుత గవర్నరుకు వైసీపీ సంగతంతా తెలుసు.ఏమన్నా అంటే వర్లకు రాజ్యసభ ఇవ్వలేదని అంటారు.. అది మా పార్టీ అంతర్గత వ్యవహరం.దళిత సంక్షేమం బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాళ్ళు విసిరారు వర్ల రామయ్య.
Read Also: Visas To Indians: విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతీయులకు మిలియన్ కంటే ఎక్కువ వీసాలు
