Site icon NTV Telugu

Varla Ramaiah: మాజీ మంత్రి బొత్సపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

Varla

Varla

Varla Ramaiah: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. ఉపాధ్యాయుల వద్ద నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ.. ఇలా దాదాపు 65 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.. బొత్స హయాంలోం జరిగినంత మోసం ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. ఎన్నికల కోడ్‌ వచ్చాక బదిలీలు చేశారని మండిపడ్డారు. దళారులు, బొత్స పేషీలలో వారిపై 1600 నుంచి 2500 మంది టీచర్లు దాడికి సిద్ధంగా ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు.. బొత్స, ఆయన పేషీలో ఘనాపాటీలపై దాడి చేస్తారని తెలుస్తోందన్నారు. ఏసీబీ డీజీ అందుబాటులో లేరు‌.. ఎస్పీ ఉన్నారు.. కంప్లైంట్ ఇచ్చామని.. అంతా శ్రీకృష్ణ జన్మస్ధానంలో కూచుంటారని ఎద్దేవా చేశారు. మీ అవినీతి భాగోతం అంతా బయటకు వస్తుందని హెచ్చరించారు వర్ల రామయ్య.

Read Also: Damodara Rajanarsimha : డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

Exit mobile version