NTV Telugu Site icon

YSRCP Leader Murder Case: వైసీపీ నేత హత్య కేసు.. టీడీపీ నేత అరెస్ట్..

Murder Case

Murder Case

YSRCP Leader Murder Case: క‌డ‌ప‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. గత నెల 23న కడప సంధ్య స‌ర్కిల్ లో శ్రీనివాసుల రెడ్డి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.. హత్య చేసేందుకు నిందితులకు టీడీపీ నేత పాలెం పల్లె సుబ్బారెడ్డి గట్టి ప్రోత్సాహం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. రూ. 30 లక్షలు డబ్బులు సుపారితో పాటు అన్నీ చూసుకుంటాన‌ని నిందితులకు భరోసా ఇచ్చాడట సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్టాడిన డీఎస్పీ ఎండి. షరీఫ్.. ఈ సంచలన విషయాలను వెల్లడించారు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్ తో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. ప్రధాన కుట్రదారుడైన టీడీపీ నేత పాలంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని కూడా అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

Read Also: Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు

ఏ3 ముద్దాయి మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్య కు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో హత్యకు కుట్ర చేశారని తెలిపార డీఎస్పీ షరీఫ్‌.. హతుడు శ్రీనివాసుల రెడ్డికి, పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇరువురి మధ్య పెండింగ్ లో కొన్ని భూ వివాదాలు ఉన్నాయని.. శ్రీనివాసులరెడ్డి వ్యాపారంలో ఎదుగుతూ ఉండడంతో ఓర్వలేకపోయిన టీడీపీ నేత సుబ్బారెడ్డి కుట్రకు పూనుకున్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత ఏ 3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డి కి హతమార్చినట్టు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించాం.. అరెస్ట్ అయిన టీడీపీ నేత పాలెంపల్లి సుబ్బా రెడ్డి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని వెల్లడించారు. రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులతో పాటు ఒక ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుబ్బారెడ్డి నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ ఎండీ షరీఫ్‌ తెలిపారు.