Palakurthi Thikka Reddy: ఏరిగేరి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటాం.. నేను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను.. మీకు పక్కా ఇళ్లు కట్టిస్తాం అని హామీ ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.. కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రాలయంలో మూడుసార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి.. మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని దుయ్యబట్టారు. ఏరిగేరి గ్రామంలో అప్పటి ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి 2006లో పేద ప్రజలకు పట్టాలు పంపిణీ చేస్తే ఇప్పుడున్న ఆయన సోదరుడు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. ఈ స్థలం మాది, మా బంధువులది అది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకొని అమ్ముకోవాలని చూస్తే.. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, నేను పోరాటం చేసి ప్రజలు తిరగబడ్డారని తెలుసుకొని.. ఇప్పుడు అదే పట్టాలను తమ బంధువులకి ఇవ్వడమే కాకుండా రోడ్డు వైపుల ఉన్న ఎక్కువ స్థలాన్ని బంధువులకు పంచిపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.
Read Also: Expressway : ఢిల్లీ నుండి జైపూర్ 2 గంటల ప్రయాణం.. 30శాతం తక్కువ చార్జీ.. విమానం లాంటి సౌకర్యం
అక్కడ ప్రజల స్థలాలు ప్రజలకే చెందాలని రానున్న రోజుల్లో మరింత పోరాటం చేస్తాం అన్నారు తిక్కారెడ్డి.. ఎవరైతే అక్రమంగా ఎక్కువ స్థలాలను ఆక్రమించుకున్నారో.. పట్టాలు ఎక్కువ తీసుకున్నారో.. వాటిని తిరిగి ప్రజలకే అందజేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఏరిగేరి గ్రామంలో ప్రజలకు అండగా ఉంటాం అన్నారు.. నేను కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను.. మీకు పక్కా ఇళ్లు కట్టిస్తాం అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చేన్నబసప్ప ధని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కోట్రేష్ గౌడ్, మైనార్టీ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్, టీయన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి, డాక్టర్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, మైనార్టీ జిల్లా కార్యదర్శి రెహ్మాన్, బిసి సాధికార సభ్యులు సిద్ధు, ఏరిగేరి బసవరాజు, ఐ టిడిపి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మంజునాథ్ ధని, ఉమేష్,యస్ సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఏరిగేరి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.