జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు: లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలపై అధికార పార్టీ దాడులు చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇప్పటివరకు జగన్ అంటే ముఖ్యమంత్రి అని గౌరవం ఉండేదని, కానీ ఆయన వికృతి బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగిస్ట్ అని అంటున్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆనవాయితీలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్యానికి పాతరేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడని లోకేష్ ఫైరయ్యారు. ఆయన పతనానికి ఆయనే ఒక్కో ఇటుక పేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగు దేశం కార్యకర్తల సహనాన్ని చేతకానితనం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఉరికించి కొట్టడానికి టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదని, తమ క్యాడర్‌కు తమ అధినేత కనుసైగ చేస్తే చాలని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడం టీడీపీ కార్యకర్తలకు నిమిషం పని అన్నారు. ఫ్యాన్ రెక్కలు మడిచి పెయిడ్ ఆర్టిస్టులను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని లోకేష్ గుర్తుచేశారు. జగన్ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడటం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే పోలీసుల సాయంతో మాఫియా సామ్రాజ్యం నడిపిస్తున్నారని లోకేష్ విమర్శించారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!