NTV Telugu Site icon

Julakanti Brahmareddy: మాచర్ల ఉద్రిక్త పరిస్థితులకు పోలీసుల ఫెయిల్యూరే కారణం

Julakanti

Julakanti

Julakanti Brahmareddy: మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారణమని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన టీడీపీ వాళ్ళని పరామర్శించాలంటే పర్మిషన్ లేదంటున్నారని.. కత్తులు, కర్రలతో పరామర్శలకు వెళ్లిన వారికి, పర్మిషన్లు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు మనసుతో పలకరిద్దామని అనుకుంటే అనుమతి ఇవ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితిలోనే నేటి మాచర్ల పర్యటన వాయిదా వేసుకున్నానని, రెండు రోజుల్లో పోలీసుల అనుమతి తీసుకొని మాచర్ల పర్యటనకు వెళ్తామన్నారు.

Read Also: BJP MP Laxman: బెంగాల్లో జరిగినట్టే ఆంధ్ర, తెలంగాణలోని బీసీ- ఈలో ముస్లింలను చేర్చారు..

టీడీపీ, పోలీసులు కలిసిపోయారు అని వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఐదేళ్లుగా టీడీపీ నాయకులను వేధించిన పోలీసులు ఇప్పుడు మాతో ఎందుకు కలుస్తారన్నారు. ప్రధాని మోడీ సభకే పోలీసులు సరైన భద్రత ఇవ్వలేకపోయారు.. పల్నాడులో శాంతిభద్రతలను కట్టడి చేయలేకపోయారు.. ఇప్పుడు పోలీసుల్లో మార్పు మాకు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం రావాలంటే రెచ్చగొట్టే నాయకులు మాచర్ల బయట ఉండాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.