NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి స్పష్టం చేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని అధిష్టానం చెప్పిందని, మళ్ళీ పోటీ చేసి గెలవడం ఖాయమని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో రాజమండ్రి రూరల్‌కి వెళ్ళానని వివరణ ఇచ్చారు.

Read Also: Harirama Jogaiah: మీ వైఖరేంటో చెప్పాలి.. పవన్‌ కళ్యాణ్‌కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ

నాకు ఎక్కడ సీటు ఇచ్చినా గెలిచి తీరుతానని బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో టిక్కెట్లు మార్పులు చేర్పులను తీవ్రంగా విమర్శించారు. ఇంట గెలవలేని వాడు రచ్చ గెలుస్తాడా అంటూ మంత్రుల స్థానచలనంపై వ్యాఖ్యానించారు
ఈ తప్పు అభ్యర్థులుది కాదు జగన్ దేనని, రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు.

Show comments