Buddha Venkanna: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సెటైరికల్ కామెంట్లు చేశారు.. అడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు.. వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసింది. పార్టీలో చేరిన వారానికే రాయుడు రాజీనామా చేశాడు అని.. రాజీనామా చేసిన అంబటి రాయుడుకి శుభాకాంక్షలు అని తెలిపారు.. తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నాం. 2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నాం. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారు. అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తాం అని ప్రకటించారు.
Read Also: Thandel : బుజ్జి తల్లే వచ్చేత్తున్న కదే.. ఈ సారి గురి తప్పదేలే అంటున్న నాగచైతన్య
టీడీపీలో పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు బుద్దా వెంకన్న.. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు.. ఆ నేతలకు గుర్తింపు తీసుకురావాలని ఎద్దేవా చేశారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదన్న ఆయన. వైసీపీలో ఒకరైన గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటాన్ని మేం తప్పుపట్టంలేదు.. కానీ, రాజ్యసభలలో ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ బీసీ నేతలకి ప్రయారిటీతో పాటు గౌరవం ఇస్తుందన్నారు. ఇక, వైఎస్ కుటుంబానికి కొడాలి నాని గౌరవిస్తాడు తప్ప.. ఎన్టీఆర్ కుటుంబానికి ఇవ్వడు అని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు చేస్తే 100 దేశాలలో ఆందోళన చేశారు. కొడాలి నానిని ఏ దేశం వెళ్లినా వదలరు అని హెచ్చరించారు. నారా కుటుంబాన్ని విమర్శిస్తే మేం జగన్‌ను విమర్శిస్తాం. జగన్‌ని తిట్టించాలని ఉంటే వైసీపీ నేతలు మమ్మల్ని తిట్టాలని సూచించారు బుద్దా వెంకన్న.
