Bode Prasad: టీడీపీలో పెనమలూరు టికెట్ రచ్చ సృష్టిస్తోంది.. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత ఈ సారి పెనమలూరు టికెట్ ఆశిస్తుండగా.. ఈ ఎన్నికల్లో టికెట్ లేదంటూ టీడీపీ అధిష్టానం నుంచి బోడే ప్రసాద్‌కు సమాచారం వెళ్లిందట.. అయితే, దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోడే ప్రసాద్.. నా రాజకీయ జీవితంలో అవినీతి మరక లేకుండా పనిచేశానన్న ఆయన.. నాపై అనేక ఆరోపణలు చేశారని మండిపడ్డారు. పెనమలూరు ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా భావించారు.. ఓడిపోయిన తొలిరోజు నుంచి నియోజక వర్గంలో పనిచేశాను.. ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అని గుర్తుచేసుకున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు కోటి రూపాయలు ఖర్చు చేశాను.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కోసం ఏం చేశానో అందరికీ తెలుసన్నారు.
Read Also: konda vishweshwar reddy: చేవెళ్లలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది..
అయితే, నాకు టికెట్ ఇవ్వలేక పోతున్నట్టు చంద్రబాబు చెప్పమన్నారని నాకు సమాచారం ఇచ్చారని తెలిపిన బోడే ప్రసాద్.. కానీ, నేను ఏ తప్పు చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. IVRS, సర్వేలు కూడా బాగున్నా టికెట్ ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఓడిపోయిన సమయంలో కూడా ఇంత బాధపడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్లుగా కుటుంబానికి సమయం ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేశాను.. టికెట్ లేదని చెప్పటం చాలా బాధగా ఉందన్నారు. కానీ, నేను చంద్రబాబు భక్తుడిని.. చంద్రబాబు కుటుంబంలో ఎవరు పోటీ చేసినా నేను నా వర్గం నెత్తిన పెట్టుకుని గెలిపిస్తాం అన్నారు. కానీ, బయట వ్యక్తులు వస్తే ఇక్కడి ప్రజలు సహకారం అందించరు అనే తరహాలో కామెంట్ చేశారు. ఏది ఏమైనా.. నేను టీడీపీలోనే ఉంటాను.. టీడీపీలో ఉండే నేను పోరాటం చేస్తాను అని ప్రకటించారు. అంతేకాదు.. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బోడే ప్రసాద్.
Read Also: Sudha Murty: రాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణం
అయితే, పెనమలూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.. టీడీపీకి రాజీనామా చేసే దిశగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆయన అనుచరులు అడుగులు వేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.. పెనమలూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్నారు బోడే ప్రసాద్.. అయితే, ఆయనకు టికెట్ ఇవ్వలేమని సమాచారం ఇచ్చింది పార్టీ అధిష్టానం.. దీంతో, రాజీనామా చేయాలనే నిర్ణయానికి బోడే ప్రసాద్ వచ్చారని తెలుస్తోంది.. ఫోన్ లో బోడేను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు పార్టీ నేతలు.. టికెట్ దక్కకపోతే బోడే రాజీనామా చేయటం ఖాయమని ఆయన వర్గం చెబుతూ వచ్చింది. మరోవైపు.. బోడే కి టచ్ లోకి వచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు ఉన్నట్టుగా ప్రచారం సాగింది.. కానీ, చివరకు తాను టీడీపీలోనే కొనసాగుతానంటూ బోడే ప్రసాద్ స్వయంగా స్పష్టం చేశారు.