TDP Jayaho BC Public Meeting: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ ‘జయహో బీసీ’ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు చంద్రబాబు, పవన్, బాలయ్య సహా రెండు పార్టీల బీసీ నేతలు హాజరు కానున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు.
Read Also: AP High Court: టెట్, టీఆర్టీ పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశం
ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రేపు బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు – పవన్ ప్రకటించబోతున్నారని చెప్పారు. టీడీపీ – జనసేన అధికారంలోకి రాగానే ఏం చేస్తామనేది రేపటి సభ ద్వారా తెలియజేస్తామన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీలకతీతంగా రేపు బీసీలు తరలి రాబోతున్నారని.. బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో బీసీలు హాజరు కాబోతున్నారని వెల్లడించారు. రేపటి బీసీ సభ ఫెయిల్ చేయాలని ప్రభుత్వం అన్ని ఆటంకాలు సృష్టిస్తోందని.. ఆర్టీసీ బస్సులు అద్దెకు అడిగినా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రేపు సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే.. కాలి నడకనైనా బీసీలు సభకు తరలి వస్తారన్నారు. ఐదుగురు రెడ్లకు రాష్ట్రాన్ని జగన్ పంచాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.
మంగళగిరిలో రేపు నిర్వహించే జయహో బీసీ కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీసీలను కోరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీసీ వర్గాల ఆబ్యున్నితికి కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయన్నారు. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు జయహో బీసీ సమావేశం ప్రారంభమవుతుందన్నారు.