NTV Telugu Site icon

Lok Sabha Speaker Election: స్పీకర్‌ ఎన్నిక.. ఎంపీలకు విప్‌ జారీ చేసిన టీడీపీ

Tdp

Tdp

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది తెలుగుదేశం ‌పార్టీ. తమ పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసింది టీడీపీ.. రేపు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్‌లో పేర్కొన్నారు పార్టీ చీఫ్ విప్ జీఎం హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 11 గంటల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని, ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్నారు హరీష్ బాలయోగి.. రేపు ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్నారు టీడీపీపీ నేత శ్రీకృష్ణ దేవరాయలు.. ఈ సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్ కు వెళ్లనున్నారు టీడీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీకి చెందిన బీజేపీ, జనసేన సభ్యులను కూడా సమావేశానికి ఆహ్వానించింది టీటీడీపీ..

Read Also: David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డేవిడ్ భాయ్..

కాగా, స్పీకర్‌ ఎన్నికల సమయంలో టీడీపీ ఓట్లు ఎన్డీఏ కూటమికి కీలకంగా మారాయి.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్‌ ఫిగర్‌ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కుతుంది. అయితే, స్పీకర్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్‌ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన విషయం విదితమే.