Site icon NTV Telugu

TDP: పెనమలూరు సీటుపై టీడీపీలో వీడని చిక్కుముడి

Tdp

Tdp

TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపీ టీడీపీలో చిక్కుముడి ఇంకా వీడడం లేదు. కృష్ణా జిల్లా పెనమలూరు సీటును మాత్రమే టీడీపీ అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది.

Read Also: Andhrapradesh: గుడ్‌ న్యూస్.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు

కమ్మ లేదా మైనార్టీ వర్గానికి సీటిచ్చే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం నుంచి దేవినేని ఉమా, బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఎం.ఎస్‌ బేగ్‌ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో ఓట్లను గణాంకాల వారీగా జల్లెడ పట్టి సర్వేలను టీడీపీ అధిష్ఠానం చేయిస్తోంది. వైసీపీ నుంచి బీసీకి చెందిన మంత్రి జోగి రమేష్ ఖరారు కావడంతో వీలైనంత త్వరగా ఇక్కడ అభ్యర్దిని ఖరారు చేయాలని పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. మంత్రి జోగి రమేష్‌ ప్రత్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version