Kesineni Swetha: ముందు కార్పొరేటర్ పదవికి, తర్వాత టీడీపీకి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Swetha: ముందు విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్ పదవికి రాజీనామా చేస్తాను.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని కూతురు, టీడీపీ కార్పొరేటర్ కేశినేని శ్వేత.. టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా రోజుకో అప్డేట్ ఇస్తున్న ఎంపీ కేశినేని నాని.. ఈ రోజు తన కూతురు రాజీనామా వ్యవహారాన్ని బహిర్గతం చేశారు.. ఇక, దాని అనుగుణంగానే శ్వేత అడుగులు పడుతున్నాయి.. ఈ రోజు ఉదయం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో భేటీ అయ్యారు కేశినేని శ్వేత.. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.. రాజీనామా చేసేందుకు సిద్ధమైన వేళ.. గద్దెను కలిసి.. తన రాజీనామా వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఇక, గద్దె రామ్మోహన్‌తో భేటీ తర్వాత కేశినేని శ్వేత మాట్లాడుతూ.. నాకు గద్దె రామ్మోహన్ ఆత్మీయులు.. నాకు ఆయన చాలా సహకరించారని తెలిపారు.. కలిసి ఒక మాట చెప్పాలని వచ్చాను అన్నారు. ఇక, ముందుగా మేయర్ ను కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా అందజేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తాను అని ప్రకటించారు. అయితే, గద్దె రామ్మోహన్ తో మా నాన్న విషయం చర్చకు రాలేదని స్పష్టం చేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. శ్వేత నన్ను కలిసి మాట్లాడారు.. జాగ్రత్తగా చూసి చేసుకోమని చెప్పాను అన్నారు. రాజీనామా ఎందుకు..? ఏమిటి..? అనే కారణాలు చర్చించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎంపీ కేశినేని నాని రాజీనామా అంశం నాకు చెప్పలేదన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ .
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
- OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
కాగా, ఇప్పటికే తాను ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు బెజవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత.. కాసేపట్లో తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తారు.. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా ఆయన కుమార్తె శ్వేత రాజీనామా చేస్తున్నారు.. ఇక, గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేతకు మేయర్ పదవి విషయంలో కేశినేని నాని అసంతృప్తి మొదలైందని చెబుతుంటారు.. బెజవాడలో టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని పట్టుబట్టగా.. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని మరో వర్గం వ్యతిరేకించింది.. ఆ తర్వాత కేశినేని టీడీపీకి దూరమయ్యారనే వార్తలు వచ్చినా.. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. కాస్త యాక్టివ్గానే పనిచేశారు.. ఆ తర్వాత కేశినేని బ్రదర్స్ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం చేసిన సూచనలతో.. రాజీనామాకు కేశినేని నాని సిద్ధమవుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?