NTV Telugu Site icon

Chandrababu: నేడు హైదరాబాద్కు చంద్రబాబు.. రేపు ఏపీకి పయనం..!

Chandrababu

Chandrababu

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( బుధవారం ) విదేశాల నుంచి తిరిగి వస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత మహారాష్ట్రలోని మహాలక్ష్మీ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఆ తర్వాత రోజే అమెరికా వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు భాగ్యనగరానికి చేరుకోబోతున్నారు. ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికాకు చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read Also: Counting Votes: ఏపీలో కౌంటింగ్కు ఏర్పాట్లు.. రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు..

కాగా, దాదాపు రోజుల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్ నగరానికి చంద్రబాబు ఈరోజు తిరిగి వస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రాష్ట్రానికి వస్తుండటంతో ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు ఉత్సాహపడుతున్నారు. అలాగే, రేపు ( గురువారం ) చంద్రబాబు అమరావతికి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Read Also: Hanshita Reddy : గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు కూతురు..

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. ఇక, రేపు అమరవతికి చేరుకుని ఓట్ల లెక్కింపు వరకు అక్కడే ఉండనున్నారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, రాష్ట్రంలో కౌంటింగ్ కు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Show comments