Chandrababu: నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను అన్నారు.. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తాను అన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని వెల్లడించారు చంద్రబాబు.
Read Also: KA Paul: హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారు..
రాష్ట్రంలో మరల పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు చంద్రబాబు.. నా శేష జీవితం ఇక ప్రజలకు అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అన్నారు. ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతాం.. ఇబ్బంది పెడితే మర్చిపోం అన్నారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారు.. నా బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసారు.. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరాను అన్నారు.
Read Also: SpaceX: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ విషెస్
ఇక, నా కష్టంలో భారతీయులంతా స్పందించారు.. విదేశాల్లో సైతం నాకోసం ప్రార్ధనలు చేశారు.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు చంద్రబాబు.. కాగా, ఈ రోజు సతీ సమేతంగా ఇంద్రకీలాద్రి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు చంద్రబాబు.. ఆయనతో పాటు ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని, మాగంటి బాబు, పోతిన మహేష్, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, పంచుమర్తి అనురాధ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు..