Site icon NTV Telugu

Chandrababu Naidu: రేపు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు!

Chandrababu Naidu Sad

Chandrababu Naidu Sad

Chandrababu Naidu to attend Siddarth Luthra Son’s Wedding Reception: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. నవంబర్ 27న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు బాబు హాజరవుతారు. లూథ్రా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు సన్నిహితులు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు బాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి రిసెప్షన్‌కు హాజరుకానన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. అదే రోజు రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్‌లో జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. చంద్రబాబు కేసులకు సంబంధించి హైకోర్టుల్లో సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: KP Krishnamohan Reddy: వైసీపీ నాయకులపై దుష్ప్రచారం తగదు: కృష్ణమోహన్ రెడ్డి

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నవంబర్ 20న బాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. నవంబర్ 21న ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. బాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ సుప్రీం కోర్టును కోరింది.

Exit mobile version