Site icon NTV Telugu

Chandrababu: వైసీపీ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు..

Chandrababu

Chandrababu

Chandrababu: అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏడు సీట్లు మనమే గెలవబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోనసీమ అందాలసీమ అని ఆయన అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మంచినీరు అడిగితే కొబ్బరి నీరు ఇచ్చే మంచి మనసున్న వారు ఇక్కడి ప్రజలు అని ఆయన అన్నారు. ప్రశాంతమైన కోనసీమలాంటి ప్రాంతంలోనూ చిచ్చు పెట్టారని.. అరాచకాలు, దాడులు, కేసులు నమోదవుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. వైకాపా పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరన్నారు. రైతులు, రైతు కూలీలూ, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, గుత్తేదారులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. దగాపడ్డ ప్రజల్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా అని పిలుపు ఇచ్చామన్నారు.

Read Also: YS Sharmila: వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరా..

ఆక్వా రైతు నిండా మునిగారు, ధాన్యం రైతు దగా పడ్డారని.. గంజాయి రైతు మాత్రం ఆనందంగా ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. ధాన్యం కొనే వారు లేరన్న ఆయన.. అరకొరగా డబ్బులు ఇచ్చారన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేశామన్న ఆయన.. పోలవరం పూర్తయితే రైతులకు నీటి సమస్య తీరేదన్నారు. ఆక్వా రైతులు చితికిపోయారని ఆయన చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ.. “100 సంక్షేమ పథకాలకు కోతపెట్టారు. రు .10 రూ ఇచ్చి 100 దోచుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. నాసిరకం మద్యం తాగి 35 లక్షలమంది ఆరోగ్యం దెబ్బతింది. 30 వేల మంది చనిపోయారు. సీఎం ధన దాహానికి జనం బలైపోయారు. బీసీలకు ఏడాదికి 15 వేలు ఖర్చు పెడతామన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశారు. ఇసుక దోపిడీ చేస్తున్నారు. సమాజ సంపదను దోచుకుంటున్నారు. 40 లక్షల మంది తాపీ వర్కర్లు ఉపాధి కోల్పోయారు. కాపులకు పది రూపాయలు కూడా ఇవ్వలేదు. మీరు ఐదేళ్లు దోపిడీ చేసి నెపం ఎమ్మెల్యేలపై వేస్తున్నారు. రెడ్లకు కూడా న్యాయం జరగలేదు. 95 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. 40 మంది గుత్తేదారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బదిలీ చేస్తున్నారు. నా జీవితంలో ఇలాంటి బదిలీలు చూడలేదు. దళిత నాయకులతో మాట్లాడరు, వారిని కలవరు, వారిని నించోబెట్టి అవమానించారు. సీఎం ఎప్పుడూ తప్పులు మీద తప్పులు చేస్తూ అందర్నీ మోసం చేస్తున్నారు. అంటరానితనం నిర్మూలనకు 12 జీవోలు తెచ్చిన పార్టీ టీడీపీ.” అని చంద్రబాబు అన్నారు.

Read Also: TDP-Janasena: విజయవాడ పశ్చిమ టికెట్.. టీడీపీ-జనసేన కూటమిలో పెరుగుతున్న పోటీ

అంబేద్కర్ పేరు తలవడానికి, విగ్రహాలు పెట్టడానికి జగన్‌కు అర్హత లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు మాట్లాడుతూ..” వచ్చేది తెదేపా- జనసేన ప్రభుత్వమే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మండపేట వైకాపా ఇంఛార్జ్ చాలా తెలివైనవాడు. అధికారం ఎక్కడ ఉంటే ఈయన అక్కడ ఉంటారు
అరాచకవాది, రౌడీయిజం చేస్తారు. ఆయారాం.. గయారాంలను రానీయం. ఇసుక, గ్రావెల్, మైనింగ్ ద్వారా 500 కోట్లు దోచేశారు. దళితులపై కేసులు పెట్టించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే జోగేశ్వరరావుని మళ్లీ గెలిపించాలి.” అని చంద్రబాబు కోరారు.

Exit mobile version