Yarlagadda Venkata Rao: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. అన్ని గ్రామాలు, కాలనీలు, ఇళ్లను కలియదిరుగుతూ.. ప్రజలను నుంచి మద్దతు కూడగడుతున్నారు.. ఇక, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని మొగిలిశెట్టి సత్యనారాయణ టవర్స్, వెంకటకృష్ణ అపార్ట్మెంట్, విజయలక్ష్మీ ఎంక్లేవ్ లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆయా అపార్ట్మెంట్ వాసులతో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు.. స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ.. రాబోయే టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేసి తనకు సంపూర్ణ మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ ఎన్నికల్లో యార్లగడ్డ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని యార్లగడ్డ ప్రచారం చేస్తున్నారు.