Site icon NTV Telugu

Nuzvid: నూజివీడులో ఆసక్తికర పరిణామాలు.. ఇంఛార్జ్‌ని ప్రకటించిన టీడీపీ

Nuzvid

Nuzvid

Nuzvid: నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.. నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా కొలుసు పార్థసారథిని ప్రకటించింది పార్టీ అధిష్టానం.. దీంతో, వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి పార్థసారథి పోటీ చేయడం ఫైనల్‌ అయ్యింది.. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన పార్థసారథి.. టీడీపీలో చేరిన తర్వాత.. నూజివీడుపై ఫోకస్‌ పెట్టారు.. ఈ పరిణామాలు అప్పటి వరకు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయినకు నచ్చలేదు.. కానీ, ముద్రబోయినకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది టీడీపీ.. ఆయన మాత్రం రాజీపడలేదు.. కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నన్ను మోసం చేశారంటూ కన్నీరుమున్నీరయ్యారు.. ఆ తర్వాత సోమవారం రోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ముద్రబోయిన. దీంతో.. కొలుసు పార్థసారథిని నూజివీడు ఇంఛార్జ్‌గా నియమించింది టీడీపీ అధిష్టానం.. ఈ మేరకు టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version