NTV Telugu Site icon

YSRCP: కొనసాగుతోన్న వలసలు.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేతలు..!

Ycp

Ycp

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూ.. ముఖాముఖి కార్యక్రమాలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో ముందుకు సాగుతోన్న ఏపీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు వలసలపై దృష్టిసారించారు.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఉన్న అసంతృప్త నేతలను పిలిచి కండువా కప్పేస్తున్నారు.. ప్రతీరోజు ఏదో ఒక పార్టీ నుంచి నేతల వలసలు సాగుతూనే ఉండగా.. ఈ రోజు పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో సీఎం జగన్‌ స్టేట్ పాయింట్‌ దగ్గర మరికొందరు కీలక నేతలు చేరారు. తెలుగుదేశం, బీజేపీ నుంచి వచ్చిన నేతలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌..

Read Also: Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ కౌంటర్

పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం, బీజేపీ నేతలు ఈరోజు వైయస్సార్సీపీలో చేరారు.. వారికి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జగన్‌.. వారిలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ.. కోడుమూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి.. బీజేపీ నుంచి మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్‌ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్‌ తదితరలు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఆలూరు టీడీపీ నుంచి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, చిప్పగిరి మాజీ ఎంపీపీ భీమలింగప్ప చౌదరి, నియోజకవర్గ నేత షీలాధరణ్, వాల్మీకి సంఘం సీనియర్‌ నేత, మాజీ జెడ్పీటీసీ దేవేంద్రప్ప, వలిగొంద మాజీ ఎంపీపీ సిద్ధప్ప తదితరలు వైసీపీలో చేరారు. వారితో పాటు.. వారి అనుచరులకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో కర్నూలు వైయస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి బీవై రామయ్య, ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.