NTV Telugu Site icon

TCL 115inches TV: ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీ వచ్చేసిందోచ్

Tcl

Tcl

ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు చేయాలి. ఈ టీవీని మీరు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ టీవీలో ఉన్న ఫీచర్లు చూస్తే ఈ ధర కూడా తక్కువే అనిపిస్తుంది. మారి ఆ ఫీచర్లు ఒకసారి చూసేద్దామా..

Also Read: Marnus Labuschagne: మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అంటూ పోస్ట్

* పెద్ద స్క్రీన్: 115 అంగుళాల స్క్రీన్‌తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ టీవీల్లో ఒకటి.

* అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ: 98% DCI-P3 కలర్ రేంజ్‌తో చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.

* అద్భుతమైన సౌండ్: బిల్ట్-ఇన్ ఆంకియో 6.2.2 హై-ఫై సౌండ్ సిస్టమ్‌తో సినిమా హాల్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది.

* గేమర్స్‌కు పర్ఫెక్ట్: 144Hz రిఫ్రెష్ రేట్, 10ms రెస్పాన్స్ టైమ్‌తో గేమ్స్ ఆడటానికి చాలా బాగుంటుంది.

* స్మార్ట్ ఫీచర్లు: గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మీకు నచ్చిన యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో మల్టీ-వ్యూ 2.0 అనే ఫీచర్ ఉండడంతో.. ఒకేసారి రెండు స్క్రీన్లను చూడవచ్చు. ఇది యాపిల్ హోమ్‌కిట్, ఎయిర్‌ప్లే 2 లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

Also Read: ESIC Jobs: భారీగా జీతాలు.. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

మీరు సినిమాలను చూడటం, గేమ్స్ ఆడటం చాలా ఇష్టపడితే అలాగే మీకు బడ్జెట్ సమస్య లేకపోతే ఈ టీవీ మీ కోసమే. ఇది మీ ఇంటిని ఒక సినిమా హాల్‌గా మార్చేస్తుంది. కానీ, ఈ టీవీ ధర చాలా ఎక్కువ కాబట్టి, కొనుగోలు చేయాలని నిర్ణయించే ముందు బాగా ఆలోచించండి. TCL 115 అంగుళాల టీవీ టెక్నాలజీ ప్రపంచంలో ఒక మైలురాయి. ఇది ఇంటి థియేటర్ అనుభవాన్ని తీసుకువచ్చింది. అయితే, ఈ టీవీ ధర మాత్రం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండదు.

Show comments