TCL 115inches TV: ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీ వచ్చేసిందోచ్
- ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీని విడుదల చేసిన TCL.
- భారీ స్క్రీన్, అద్భుతమైన క్వాలిటీతో అబ్బురపరిచే టీవీ.
- మరికొన్ని అధునాతన ఫీచర్లతో విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు చేయాలి. ఈ టీవీని మీరు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ టీవీలో ఉన్న ఫీచర్లు చూస్తే ఈ ధర కూడా తక్కువే అనిపిస్తుంది. మారి ఆ ఫీచర్లు ఒకసారి చూసేద్దామా..
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
* పెద్ద స్క్రీన్: 115 అంగుళాల స్క్రీన్‌తో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ టీవీల్లో ఒకటి.
* అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ: 98% DCI-P3 కలర్ రేంజ్‌తో చాలా అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది.
* అద్భుతమైన సౌండ్: బిల్ట్-ఇన్ ఆంకియో 6.2.2 హై-ఫై సౌండ్ సిస్టమ్‌తో సినిమా హాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది.
* గేమర్స్‌కు పర్ఫెక్ట్: 144Hz రిఫ్రెష్ రేట్, 10ms రెస్పాన్స్ టైమ్‌తో గేమ్స్ ఆడటానికి చాలా బాగుంటుంది.
* స్మార్ట్ ఫీచర్లు: గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మీకు నచ్చిన యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో మల్టీ-వ్యూ 2.0 అనే ఫీచర్ ఉండడంతో.. ఒకేసారి రెండు స్క్రీన్లను చూడవచ్చు. ఇది యాపిల్ హోమ్‌కిట్, ఎయిర్‌ప్లే 2 లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
Also Read: ESIC Jobs: భారీగా జీతాలు.. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
మీరు సినిమాలను చూడటం, గేమ్స్ ఆడటం చాలా ఇష్టపడితే అలాగే మీకు బడ్జెట్ సమస్య లేకపోతే ఈ టీవీ మీ కోసమే. ఇది మీ ఇంటిని ఒక సినిమా హాల్‌గా మార్చేస్తుంది. కానీ, ఈ టీవీ ధర చాలా ఎక్కువ కాబట్టి, కొనుగోలు చేయాలని నిర్ణయించే ముందు బాగా ఆలోచించండి. TCL 115 అంగుళాల టీవీ టెక్నాలజీ ప్రపంచంలో ఒక మైలురాయి. ఇది ఇంటి థియేటర్ అనుభవాన్ని తీసుకువచ్చింది. అయితే, ఈ టీవీ ధర మాత్రం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండదు.
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!