తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో బండి సంజయ్ హస్తినలోనే ఆగిపోయినట్లుగా సమాచారం.
Read Also: Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!
మరోవైపు.. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతానని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీ తనకు కేటాయించడంతో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహించనున్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయాలను అందరూ పాటించాల్సిందేనని ఆయన అన్నారు. ఒక్కరికి ఒక్క పదవే అనేది బీజేపీ విధాన్నాం.. ఈ విధానం మేరకు తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవి
కాగా.. తెలంగాణ బీజేపీలో నిన్న (మంగళవారం) అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. మరోవైపు తనకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదంటూ అలకబూనిన ఈటల రాజేందర్‌కు సైతం కీలక పదవిని కట్టబెట్టింది. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పార్టీ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి బీజేపీ హైకమాండ్ కీలకమైన పదవులు అప్పగిస్తుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.