TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
- టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి
- ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి
- మన దేశంలో చాలా మంది టీబీ రోగులు
- భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైన అంటు వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు ఇండియాలో 26%, ఇండోనేషియాలో 10%, చైనాలో 6.8%, ఫిలిప్పీన్స్‌లో 6.8%, పాకిస్తాన్‌లో 6.3% మంది ఉన్నారు. గ్లోబల్ ట్యూబర్‌క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ వ్యాధి భారం ప్రపంచవ్యాప్తంగా 56 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 55 శాతం మంది పురుషులలో.. 33 శాతం మంది స్త్రీలలో.. 12 శాతం మంది పిల్లలు, యువతలో కనుగొన్నారు.
ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 2023లో 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడినట్లు అంచనా వేశారు. టీబీ సంబంధిత మరణాల సంఖ్య 2022లో 1.32 మిలియన్లు ఉండగా.. 2023లో 1.25 మిలియన్లకు తగ్గినట్లు అంచనా వేశారు. 2023లో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య కొద్దిగా పెరిగి 10.8 మిలియన్లకు చేరుకుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స పూర్తిగా సాధ్యమే కానీ.. ఒకసారి ఆలస్యం జరిగితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికీ దగ్గుతూ ఉన్నట్లయితే పరీక్షించి, సరైన చికిత్స చేసుకోవాలి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తి ఈ టీబీ బ్యాక్టీరియాతో సంబంధంలోకి వచ్చినప్పుడు.. ఈ బ్యాక్టీరియా శ్వాస ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులలో స్థిరపడి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎక్కువగా ఈ బాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
టీబీ లక్షణాలు:
దగ్గు
రక్తం, శ్లేష్మంతో దగ్గు
ఛాతీలో నొప్పి
శ్వాస లేదా దగ్గు సమయంలో నొప్పి
జ్వరం
చలి
రాత్రి చెమటలు
బరువు తగ్గడం
తినే కోరికలు లేకపోవడం
అలసిపోయిన అనుభూతి కలిగి ఉండటం.
టీబీ సాధారణ లక్షణం నిరంతర దగ్గు.. కాబట్టి దగ్గు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లైతే, చెక్ చేసుకుని తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. అలాగే పూర్తి జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!